హైదరాబాద్, మే 14(నమస్తే తెలంగాణ) : రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంతోపాటు భూభారతి చట్టం అమలుపై గవర్నర్‌కు వివరించారు. గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా 500-700 ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.
గవర్నర్ దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుకుంట, గోగులపూడి గ్రామాలతోపాటు ఆదిలాబాద్ జిల్లా భురి, మంగ్లీ, నాగర్ కర్నూల్ జిల్లా అప్పాపూర్, బౌరాపూర్ గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లను మం జూరు చేసినట్టు పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఖమ్మం పార్లమెంటు సభ్యుడు రఘురాంరెడ్డి, ఐడీసీ ఛైర్మన్ మువ్వ విజయ్‌బాబు తదితరులు ఉన్నారు.