హైదరాబాద్ : అంకిత భావంతో సృజనాత్మకంగా తీసిన ఒక ఫొటో కొన్ని పేజీల వార్తా సారాంశాన్ని అర్థవం తంగా తెలియజేసి, పాఠకులను ఆలోచింప చేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) పేర్కొన్నారు. అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భం గా సోమవారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఫొటోగ్రఫీ(Photography exhibition) ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు దినపత్రికలు చదవటం అలవాటని, అన్ని వార్తలు చదవక పోయినా అన్ని పేజీలలోని ఫొటోలను చూసి, ఆ వార్తలోని అంశాన్ని అర్థం చేసుకుంటానని తెలిపారు. తెలం గాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం హామీలపై నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఫొటో ఎంట్రీలను ఇక్కడ ప్రదర్శించారు. ఉత్తమ ఫోటో గ్రాఫర్లను సన్మానించి అభినందించారు. ఫొటోగ్రాఫర్ల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.