శనివారం 11 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 09:20:06

జోగులాంబను దర్శించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు

జోగులాంబను దర్శించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు

జోగులాంబ గద్వాల : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండున్నర నెలల తర్వాత ఆలయాలు తెరుచుకోవడంతో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలయాల్లో తగు ఏర్పాట్లు చేశారు. ఆలయాలను శానిటైజర్ చేయడంతో పాటు భౌతిక దూరం పాటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు టెంపరేచర్ స్కానింగ్ చేసి మాస్కులు ఉన్న వారిని లోపలికి అనుమతిస్తున్నారు. కాగా, జిల్లాలోని ఆలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొవిడ్ నిబంధన అమలును మంత్రి పరిశీలించారు.


logo