Minister Niranjan Reddy | ప్రతిపక్షాలు వ్యక్తిగత దూషణలు మానుకోవాలి.. ప్రజలకు ఏం చేస్తారో అదో చెప్పాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి
Minister Niranjan Reddy | ప్రతిపక్ష పార్టీల నాయకులు(Opposition leaders) వ్యక్తిగత దూషణలతోనే రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలకు ఏం చేస్తామనేది ఎక్కడా ఎవరూ చెప్పడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Minister Niranjan Reddy) మండిపడ్డారు.
వనపర్తి, నవంబర్ 6 : ప్రతిపక్ష పార్టీల నాయకులు (Opposition leaders) వ్యక్తిగత దూషణలతోనే రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలకు ఏం చేస్తామనేది ఎక్కడా ఎవరూ చెప్పడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Minister Niranjan Reddy) మండిపడ్డారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి పాలకులు చేయలేని అభివృద్ధిని తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత ఐదేండ్లలోనే చేసి చూపించానన్నారు.
నాటి నుంచి నేటి వరకు సంప్రదాయ రాజకీయాలను మాత్రమే చూశామని, కానీ నేడు ఎన్నికల కోసం విపక్షాలు దిగజారుడుతనంతో కండ్ల ముందున్న అభివృద్ధిని చూసి కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గత 30 ఏండ్లులో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండున్నరేండ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. వనపర్తిలో మెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్, వ్యవసాయ, మత్స్య కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామన్నారు.
రోడ్ల విస్తరణతో వనపర్తి రూపురేఖలు పూర్తిగా మారిపోయాన్నారు. నియోజకవర్గంలో డీ-8 కాల్వల ద్వారా చెరువులను నింపి 95 శాతం సాగునీళ్లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి శ్రీధర్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షుడు రమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

