హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ పాలమూరు సభలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు ఊసేలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో మోదీ ఇచ్చిన ఎన్నికల ప్రచారం హామీ మోసపూరితమేనా? అని ప్రశ్నించారు. పీఆర్ఎల్ఐఎస్కు జాతీయ హోదా ప్రకటించకపోవడం పాలమూరు ప్రజలను వంచించడమేనని అన్నారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటా గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. పాలమూరుకు వచ్చి పసుపుబోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం ప్రకటించడం బీజేపీ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. వీటివల్ల పాలమూరు జిల్లాకు కలిగే ప్రయోజనాలు ఏంటి? అని ప్రశ్నించారు. పాలమూరు ప్రజలకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.