వనపర్తి : ప్రపంచలో అన్నింటికన్నా సహకార శక్తి అత్యంత బలమైనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సహకార సంఘాల ద్వారా 208 మంది రైతులకు రూ.2.30 కోట్ల విలువైన వివిధరకాల రుణాలను(Loans) అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల(Farmers) సమష్టి పెట్టుబడితో కష్టపెడితే ఏ కార్యక్రమైనా విజయవంతం అవుతుందన్నారు.
పాలమూరులో వేరుశెనగ, కంది, పప్పుశెనగ పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.నష్టాల సాకుతో ప్రభుత్వరంగ సంస్థలను నరేంద్ర మోదీ(Narendra Modi) విక్రయిస్తున్నారని ఆరోపించారు.నడిపే ప్రణాళిక, మనసు లేక కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను(Government Institutions) ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నదని మండిపడ్డారు.సహకార రంగాన్ని(Co-operative sector) బలోపేతం చేయడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
పాలకవర్గాలు వినూత్న ఆలోచనలతో సహకార సంఘాల ఆదాయం పెంచాలని సూచించారు.విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వరి కొనుగోళ్లు, వ్యవసాయ యాంత్రీకరణ వ్యాపారంపై సహకార సంఘాలు దృష్టిపెట్టాలన్నారు.పాడి రైతుల సహకార సంఘం అమూల్ దేశానికే ఆదర్శంగా ఉన్నదని కొనియాడారు. మహారాష్ట్రలో రైతుల సారథ్యంలోని సహకార సంఘాల చక్కెర పరిశ్రమలు(Sugar Factory) విజయవంతంగా నడుస్తున్నాయని. ఒక్కొక్క పరిశ్రమ విలువ రూ.300 కోట్ల నుంచి రూ.1500 కోట్ల విలువ చేస్తుందన్నారు.
తెలంగాణలో రైతుల భాగస్వామ్యంతో సహకార సంఘాల ద్వారా ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు ఒక్క పరిశ్రమ మొదలైతే వందల పరిశ్రమల ఏర్పాటుకు అదే నాంది అవుతుందని అన్నారు.