వనపర్తి, ఆగస్టు 8 : ఏ వృత్తిలోనైనా నిబద్ధతతో పనిచేస్తే తగిన డబ్బు, గౌరవం లభిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 350 మంది ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్ సంఘం సభ్యులు.. ఆ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్‌సాగర్, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య సాగర్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కార్యాలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మనం చేసే పనిని చిన్నదని భావించవద్దని, నిబద్ధతతో పనిచేస్తే అందులో గౌరవం లభిస్తుందన్నారు. వృత్తి నైపుణ్య శిక్షణలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తుమన్నారు. కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. తండాల్లో, గ్రామాల్లో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను చూస్తుంటే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అటవీశాతం 7.7 శాతం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రమోద్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్, శిక్షణా తరగతుల జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.