Minister Mallareddy | ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తుడిచిపెట్టుకపోవడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతల పల్లిలో బుధవారం జరిగిన రైతువేదిక సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంపై అవగాహన లేకుండా రేవంత్‌రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
దేశంలోనే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికల నాటికి అడ్రస్ లేకుండా పోతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ నాయకులకు కళ్లు మండుతున్నాయని మంత్రి ఆరోపించారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పధకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతు ద్రోహిలుగా మిగిలిపోతారని అన్నారు.
రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతుగా ఉంటామని రైతులు తీర్మానించారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి చదివి వినిపించిన తీర్మానానికి రైతులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత కరెంట్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా 24 గంటల కరెంట్ కావాలా..? పాముకాటు 3గంటల కాంగ్రెస్ కరెంట్ కావాలా? అంటూ రైతులు నినాదాలు నినదించారు.