హైదరాబాద్ : ఒకప్పుడు పాలు అమ్మి జీవనం కొనసాగించిన నేను పార్లమెంట్ స్థాయికి ఎదిగాను. నిరంతరం కష్టపడ్డాను కాబట్టే దేశంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్‌గా ఎదిగి.. సక్సెస్‌కు ఒక మోడల్‌గా నిలిచాను అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. కండ్లకోయలో ఐటీ పార్కుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. మన జన్మలా కూడా ఊహించలేదు. సీఎం కేసీఆర్ ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తారని, ఇక్కడ ఐటీ పార్కు రావడం మన అదృష్టం. ఒకప్పుడు ఐటీ అంటే మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ.. ఇప్పుడు ఐటీ కంపెనీలు కూడా హైదరాబాద్‌కు నార్త్ సైడ్ విస్తరిస్తున్నాయి. ఒక లక్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మేడ్చల్ జిల్లాలో ఉన్నారు. ఐటీ పార్కు ఇక్కడ నెలకొల్పడం మా పిల్లల అదృష్టం. రాబోయే రోజులు మీవే అని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.
మనషి ఎలా విజయం సాధిస్తాడో చెప్తా. విజయానికి నేనే ఒక మోడల్. 1976లో నాకు మ్యారేజ్ అయింది. 46 ఏండ్ల కింద నా వయసు 23. ఇప్పుడు నా ఏజ్ 69. అయినా చాలా స్మార్ట్‌గా ఉన్నాను. కేటీఆర్ సార్ అంతా స్మార్ట్ లేను. కానీ నాకు, ఆయనకే పోటీ. జీవితం, విజయం అంటే మీకు తెలవాలి. ఒక సైకిల్ మీద రోజు పాలు సప్లై చేశాను. 46 ఏండ్ల జర్నీలో ఎన్నో కష్టాలు పడ్డాను. అనేక బిజినెస్‌లు చేశాను. ఇంత పెద్ద సక్సెస్ అయ్యానంటే ఆషామాషీ కాదు. ఇది మజాక్ కాదు. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ నేనే. టాప్ టెన్‌లో ఉన్నాను. ఒక మిల్క్ వెండర్ లెవల్ నుంచి మినిస్టర్ లెవల్ వరకు వచ్చాను అని మంత్రి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.
నేనేం మంత్రాలు చేయలేదు. నేనేం బాబాను కాదు. నాకు ఫారెన్ ఫండ్స్ రాలేదు. ప్రతి రూపాయి ఇక్కడే సంపాదించా. నాకు సండే మండే లేదు. అలా కష్టపడి ఈ లెవల్‌కు వచ్చాను. మీ దగ్గర ల్యాప్‌టాప్, ఐఫోన్, ఇంజినీరింగ్ డిగ్రీ ఉంది. మీరు కష్టపడితే ప్రపంచమంతా మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు నుంచి సమయం వృథా చేయకుండా నాలా కష్టపడాలని యువతకు మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
నా విజయానికి నాలుగు సీక్రెట్లు ఉన్నాయి. టైం, డబ్బులు వృథా చేయొద్దు. రెస్పెక్ట్‌గా ఉండాలి. క్రమశిక్షణతో ఉండాలి. ప్రతి రోజు ప్లానింగ్ ఉండి, హోం వర్క్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతాం. ఫ్రెండ్ షిప్ చేయొద్దు.. ప్రేమ చేయొద్దుద. చాలా కష్టపడాలి. ఇతర దేశాలు అభివృద్ధి చెందుతున్నాయంటే వారు పక్కా ప్రణాళిక, హార్డ్ వర్క్‌తో ముందుకెళ్తున్నారు. అందుకే ఆయా దేశాలు ప్రపంచంలో ముందంజలో ఉన్నాయి. ప్రపంచాన్ని జయించే అవకాశం తెలంగాణ యువతకు ఉంది. మనకు బంగారం లాంటి సీఎం, మంచి ఐటీ మినిస్టర్ ఉన్నారు. అలా కేటీఆర్ దావోస్ వెళ్లి రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానించారు. మన హైదరాబాద్ ఐటీలో నంబర్ వన్‌లో నిలిచింది. టాప్ 5 కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయి. ఈ ఘనత కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆశీర్వాదంతో మంత్రి స్థాయికి ఎదిగాను అని మల్లారెడ్డి పేర్కొన్నారు.