మేడ్చల్ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR) ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy ) అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శనివారం జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలకు చెందిన 497 మంది మైనార్టీలకు (Minorities) రూ. లక్ష ఆర్థిక సహాయ చెక్కులను జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మైనార్టీల కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న రూ. లక్ష సహాయంతో వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆక్షాంక్షించారు. మైనార్టీలు ఆర్థికంగా సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. విదేశాలలో ఉన్నత విద్య చదివే మైనార్టీ విద్యార్థులకు రూ. 20 లక్షలను అందిస్తుందని, గురుకుల పాఠశాలలో చదివిస్తే రూ. 1. 25 వేలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.
ఆసరా పెన్షన్లు (Asara Pensions), షాదీముబారక్ (Shadi Mubarak) పథకాలను అర్హులైన మైనార్టీ నిరుపేదలకు అందిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీలను ఓటు బ్యాంకుగానే పరిగణించయే తప్ప వారి ఆర్థిక ఎదుగుదలను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి ఆశయాలను నిజం చేసేలా మైనార్టీలు వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, అభిషెక్ అగ్యస్త, డీఆర్వో హరిప్రియ, జిల్లా మైనార్టీశాఖ అధికారి ఖాసిమ్ తదితరులు పాల్గొన్నారు.