నాగర్‌కర్నూల్ : తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి బీజేపీ పాలిత రాష్ట్రాలు( BJP Ruleing states) సిగ్గుపడుతున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ మండల, మున్సిపల్ బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
60 ఏళ్లపాటు కాంగ్రెస్(Congress), తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధిని ఓర్వలేక బీజేపీకి తెలంగాణపై కన్ను పడి తెలంగాణపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారని పేర్కొన్నారు. గతంలో పాలించిన టీడీపీసైతం ఏమాత్రం అభివృద్ధి చేపట్టలేకపోయిందని ఎద్దేవాచేశారు.తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలన లో చేపట్టిన అభివృద్ధితో అన్ని జాతీయ పార్టీలు కనుమరుగయ్యయని వెల్లడించారు.
నాగర్ కర్నూల్లో మెడికల్ కళాశాల(Medical colleage), అగ్రికల్చర్ కళాశాల, అందమైన మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం గొప్ప విషయమని ప్రశంసించారు. ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డికి ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ శ్రేణులకు, నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.