VasudevaSutham Trailer | దేవి ఫేం మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న చిత్రం వసుదేవసుతం (Vasudheva Sutham). మల్టీ లింగ్యువల్ ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీని వైకుంఠ్ బోను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం జులై 10న విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ఏదో ఒక అప్డేట్ అందిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన వసుదేవ సుతం దేవమ్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతూ మూవీ, మ్యూజిక్ లవర్స్‌లో ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి వసుదేవసుతం ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
‘చంపడం నాకు సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు.. కొన్ని తప్పుల్ని క్షమించొచ్చు.. అన్ని తప్పులను క్షమిస్తే.. మనం తప్పు చేసినట్టే.. దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే హక్కు లేదు’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. వీఎఫ్ఎక్స్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, మణి శర్మ బీజీఎం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయడనంలో ఎలాంటి సందేహం లేదు.
రీసెంట్గా ‘ఆనందాల వేళ’ సాంగ్ కూడా విడుదల చేశారని తెలిసిందే. ఈ చిత్రంలో అంబికావాణి,జాన్ విజయ్, మైమ్ గోపీ, సురేష్ చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, భద్రమ్, జబర్థస్త్ రాంప్రసాద్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ దైవిక అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తున్నాయి.
వసుదేవసుతం ట్రైలర్..
A special moment as Dashing Director @DirAjayBhupathi gaaru launches the #VasudhevaSutham Trailer. ❤️🔥
Watch : https://t.co/kX4PwK93ik
Get ready to experience this heartwarming tale of faith, emotions, and wholesome entertainment in theatres from July 10th, 2026. ✨
— BA Raju’s Team (@baraju_SuperHit) July 9, 2026