Minister Mahmood Ali | ముస్లింలు అంటే ఓల్డ్ సిటీ అని ముద్ర వేసిన పార్టీలను పక్కన పెట్టాలి : హోం మంత్రి మహమూద్ అలీ
Minister Mahmood Ali | అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు చేసింది ఏమీలేదు. ముస్లింలు అంటే ఓల్డ్ సిటీ అని ముద్ర వేసిన పార్టీలను పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ (Minister Mahmood Ali ) అన్నారు. భూపాలపల్లి(Bhupapalli)లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హాజరై మాట్లాడారు.
జయశంకర్ భూపాపల్లి : అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు చేసింది ఏమీలేదు. ముస్లింలు అంటే ఓల్డ్ సిటీ అని ముద్ర వేసిన పార్టీలను పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ (Minister Mahmood Ali ) అన్నారు. భూపాలపల్లి(Bhupapalli)లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హాజరై మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముస్లింల సంక్షేమం కోసం పెద్ద పీట వేశారన్నారు. మైనారిటీ విద్యార్థుల చదువుల కోసం నూతనంగా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను, కళాశాలను ఏర్పాటు చేశారు. ముస్లిం, మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షాదీ ముబారక్ ఇవ్వాలని ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు.
ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంది ఒక్క కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గ ముస్లిం కుటుంబ సభ్యలకు ఒకటే విన్నపం.. మన కోసం మన ఆభ్యన్నతి కోసం పాటు పడుతున్న కేసీఆర్ నాయకత్వం కొనసాగలంటే మళ్లీ భూపాలపల్లిలో గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలన్నారు.
ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పనిచేసిన రేవంత్రెడ్డి తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఇప్పుడు కాంగ్రెస్ను నడిపిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బసవరాజు సారయ్య, ముస్లిం నేతలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

