KTR | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కోసం పోరాడుతున్న తరుణంలో ‘మీకు పాలన చేతకాదు’ అని అవమానించి, అవహేళన చేసినవాళ్లే ఇప్పుడు ఇక్కడి పాలనను చూసి మనసారా మెచ్చుకుంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం పరిపాలన దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతున్నది.
నాడు..
పరిశ్రమ రావాలంటే..
‘నీకెంత – నాకెంత’ అనే దుర్మార్గపు విధానం..
నేడు..
పరిశ్రమ పెట్టాలంటే…
నువ్వు పెట్టే పెట్టుబడి ఎంత?
మా తెలంగాణ యువతకు దకే ఉద్యోగాలెంత??
టీఎస్ఐపాస్ విధానంతో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం
భూమి చుట్టూ అల్లుకున్న సవాలక్ష చికుముళ్లను విప్పేందుకు ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం
– ధరణి
సాంకేతికత సహాయంతో సుపరిపాలన!
టీ వ్యాలెట్ ఒక అద్భుతం
దేశంలో తొలిసారిగా తెలంగాణలో ఆవిషరణ గత ఆరు సంవత్సరాల్లో టీ వ్యాలెట్ ద్వారా రికార్డు స్థాయిలో రూ.20,300 కోట్ల విలువైన లావాదేవీలు.
టీ యాప్ ఫోలియో
ఒక యాప్ 180కి పైగా ప్రభుత్వ సర్వీసులు అరచేతిలో ఈ-గవర్నెన్స్ ద్వారా సుపరిపాలన అందించడంలో తెలంగాణ వినియోగిస్తున్న సాంకేతికత అద్భుతం అని ప్రశంసలు, జాతీయ స్థాయిలో పలు అవార్డులు.