హైదరాబాద్: టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, సభ్యులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి మన నాయకుడు కేసీఆర్ రెండు దశాబ్దాల క్రితం టీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. ఉద్యమం నుంచి పాలన వరకు ఈ స్ఫూర్తిదాయక ప్రయాణంలో భాగస్వామ్యమవడం గొప్పవిషయం అని చెప్పారు.
Two decades ago, our leader Sri KCR Garu founded TRS Party to make the aspirations of people of #Telangana a reality
Very grateful to be a part of this inspiring journey from agitation to administration!
Heartfelt greetings to @trspartyonline leaders & members on #21YearsOfTRS pic.twitter.com/9xaK8fEOve
— KTR (@KTRTRS) April 26, 2022
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగనుంది. పార్టీ ప్లీనరీ కోసం ఇప్పటికే నగరం గులాబీమయంగా మారింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ, లోక్‌సభల సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా మొత్తం మూడు వేల మంది పాల్గొననున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రతినిధుల నమోదు.. ఆ తర్వాత స్వాగతోపన్యాసం, పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటుంది.