Afghanistan | ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో తాలిబన్లు (Taliban) విధించే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. తాలిబన్లు విధించిన చట్టాలను వ్యతిరేకించినా.. లేదంటే నేరాలకు పాల్పడిన వారికి బహిరంగంగానే ఉరితీస్తారు. తాజాగా ఒకే కుటుంబంలో 13 మందిని దారుణంగా చంపిన వ్యక్తికి తాలిబన్లు విధించిన శిక్ష ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ఖోస్ట్ ప్రావిన్స్‌లో (Khost province) కొన్ని నెలల క్రితం తొమ్మిది మంది పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని ఓ వ్యక్తి అతికిరాతంగా హత్య చేశాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. నిందితుడికి మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుతో తాలిబన్ పాలకులు హంతకుడికి బహిరంగంగా మరణ శిక్ష అమలు చేశారు. సుమారు 80 వేల మంది చూస్తుండగానే బాధిత కుటుంబంలోని 13 ఏండ్ల బాలుడితో హంతకుడిని అతికిరాతంగా కాల్చి చంపించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హంతకుడిని మంగల్గా గుర్తించారు.
Also Read..
Putin | మాస్కో నుంచే టాయ్‌లెట్, టెలిఫోన్ .. పుతిన్ భారత పర్యటనకు భద్రతా ఏర్పాట్లు ఇవి.
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఇన్స్టాగ్రామ్ స్వస్తి