రేపు కరీంనగర్లో కేటీఆర్ పర్యటన.. రూ. 1,000 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ
కరీంనగర్ : ఈ నెల 17న మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోగంగుల కమలాకర్ మాట్లాడారు. కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా రూ.615 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర మున్పిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేస్తారని తెలిపారు. దీంతో పాటుగా శబర్మతి తరహాలో రూ. 410 కోట్లతో చేపట్టే మానేరు రివర్ ఫ్రంట్ పనులకు కూడ భూమి పూజచేస్తారని తెలిపారు.
ఇందులో అధికశాతం పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తి అయినట్లు పేర్కొన్నారు. మానేరు రివర్ ఫ్రంట్‌ను వచ్చే 18 నెలల్లో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆలాగే రూ.615 కోట్ల కార్పొరేషన్ నిధులతో చేపట్టే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తామన్నారు. గత యాభైఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం ఆరేండ్లలో చేసి చూపించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండండదలతో కరీంనగర్‌ను రాష్ట్రంలోనే నంబర్ 2 సిటీగా మార్చుతున్నామని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

