హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్స్ ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. జిల్లా కేంద్రాల్లో ఇటీవలే 19 డయాగ్నోస్టిక్ హబ్స్‌ను ప్రారంభించారని తెలిపిన కేటీఆర్.. 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ కమిషనర్ కరుణ, డాక్టర్ అరుణ్, డాక్టర్ నందిత, డాక్టర్ ప్రసాద్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త నమూనాలను సేకరించి, సెంట్రల్ హబ్‌కు పంపిస్తారు. అక్కడ ఆ నమూనాలను పరీక్షించి, నేరుగా రోగి మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం అందిస్తారు. హార్డ్ కాపీలను కూడా పంపనున్నారు. మరో 16 డయాగ్నోస్టిక్ హబ్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
Completely in-house diagnostic model
— KTR (@KTRTRS) June 17, 2021
Blood samples are collected at PHCs, & analysis done in central hub
Reports are sent directly to patient’s mobile phone. Hard copies are also provided
Hon’ble CM directed that 16 more D-Hubs opened soon & also to include radiological tests pic.twitter.com/Pxrj3neAPn