మహిషాసురుడిగా మహాత్ముడు.. మండిపడ్డ కేటీఆర్
Minister KTR | మహిషాసురుడిగా మహాత్ముడిని చిత్రీకరించడంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కోల్కతాలో హిందూ మహాసభ నిర్వహించిన దుర్గాపూజలో మహిషాసురుడిని మహాత్మా
హైదరాబాద్ : మహిషాసురుడిగా మహాత్ముడిని చిత్రీకరించడంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కోల్కతాలో హిందూ మహాసభ నిర్వహించిన దుర్గాపూజలో మహిషాసురుడిని మహాత్మా గాంధీ మాదిరిగా చిత్రీకరించడాన్ని తప్పుబడుతూ మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ట్వీట్ చేశారు. గాంధీ మాదిరి ఏర్పాటు చేసిన మహిషాసురుడిని దుర్గాదేవి చంపబడినట్లుగా చిత్రీకరించారు. అయితే గాడ్సేను జాతిపితగా ప్రకటించే రోజు దూరంలో లేదని నాగేశ్వర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ను కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ ఇలా స్పందించారు. విశ్వ గురువుగా ఈ ప్రపంచం గుర్తించిన ఏకైక భారతీయుడు మహాత్మాగాంధీ అని కేటీఆర్ పేర్కొన్నారు. తమకు తాము విశ్వగురువులమని చెప్పుకునే వారు, గాడ్సేను ప్రేమించేవారు.. మహాత్ముడిని, ఆయన ఐడియాలజీని కించపరిచే వారు లక్షల సంవత్సరాలైన విజయం సాధించలేరని కేటీఆర్ పేర్కొన్నారు.
The only Indian who is acknowledged by the world as Vishwa Guru is Mahatma Gandhi Ji
No matter how hard the self-styled Vish Gurus & their Godse loving disciples would like to desecrate Mahatma & denigrate his ideology, they will not succeed in a million years#MahatmaGandhiji https://t.co/M59F6LkLAP
— KTR (@KTRTRS) October 3, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

