మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో కారు బాంబు పేలుడు ఘటన జరిగింది. ఆ పేలుడు ఘటనలో రష్యన్ జనరల్(Russian General) మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు. నగరంలోని దక్షిణ ప్రాంతంలో జరిగిన పేలుడు వల్ల భారీ సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ప్రమాదంలో మృతిచెందిన బాధిత వ్యక్తిని లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్గా గుర్తించారు. జనరల్ స్టాఫ్ ఆపరేషనల్ ట్రైనింగ్ విభాగంలో ఆయన చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే వాహనం కింద భాగంగా పేలుడు పదార్ధాన్ని అమర్చినట్లు అధికారులు చెప్పారు. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సర్వీసు ఆ పేలుడుకు పాల్పడి ఉంటుందని రష్యన్ అధికారులు అంచనా వేస్తున్నారు. లెఫ్టినెంట్ జనరల్ సర్వరోవ్ వయసు 56 ఏళ్లు. సీనియర్ ఆఫీసర్ల శిక్షణ విభాగం బాధ్యతలను ఆయనకు 2016లో అప్పగించారు. గతంలో ఆయన రష్యా దళాల తరపున సిరియాలో పనిచేశారు.