Donald Trump | ప్రపంచ దేశాలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైళ్ల (Epstein Files)ను అమెరికా న్యాయ శాఖ ఎట్టకేలకు శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదల చేసిన ఫైళ్లలో ప్రముఖులైన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్, పాప్ సింగర్స్ మైఖేల్ జాక్సన్, మిక్ జాగర్ తదితరులు ఉన్నారు.
అయితే, సెక్స్ కుంభకోణానికి సంబంధించి దాదాపు 16 ఫైళ్లు మాయమైనట్లు (16 Epstein files Missing) అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించింది. మాయమైన వాటిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫొటో కూడా ఉంది. దీనిపై పెద్ద ఎత్తున వివమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నేపథ్యంలో ఎప్స్టీన్ ఫైళ్ల నుంచి ట్రంప్ పొటోను యూఎస్ న్యాయ శాఖ పునరుద్ధరించింది (US Restores Trumps Pic). ఆ ఫొటోలో ట్రంప్ తన భార్య మెలానియా, ఎప్స్టీన్, ఆయన సన్నిహితురాలు గిస్లైన్ మాక్స్‌వెల్‌తో కలిసి కనిపించారు. ఆ ఫొటోను తాత్కాలికంగా రివ్యూ కోసమే తొలగించినట్లు అమెరికా న్యాయశాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. సమీక్ష తర్వాత ఫొటోలో బాధితులు ఎవరూ లేరని తేలడంతో తిరిగి పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.
Also Read..
ఎట్టకేలకు ఎపిస్టీన్ ఫైళ్ల విడుదల
“Epstein files | సెక్స్ కుంభకోణంలో ట్రంప్ ఫ్యామిలీ.. ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే”