Huzuarabad | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పనుల హైలైట్స్‌కు సంబంధించిన వీడియోను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. హుజరాబాద్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని, పట్టణ ప్రగతి రథం పరుగులు పెడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, మన బస్తీ మన బడి, ప్రభుత్వ ఆస్పత్రి, ఓపెన్ జిమ్‌లు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా, తెలంగాణ క్రీడా ప్రాంగణం, రైతు బజార్, వ్యవసాయ గోడౌన్లు, కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, వైకుంఠధామాలు, కొత్తగా నిర్మించిన మురుగు కాల్వలు, పారిశుధ్య వాహనాలు, నర్సరీలు, పబ్లిక్ టాయిలెట్స్, కొత్తగా అభివృద్ధి చేసిన పార్కులు, సెంట్రల్ లైటింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని వీడియోలో పేర్కొన్నారు.
హుజూరాబాద్ లో అద్భుత అభివృద్ధి పథం
పరుగులు పెడుతున్న పట్టణ ప్రగతి రథం!చక్కని భవనాల్లో విద్యా వికాసం
అత్యాధునికంగా ప్రజా వైద్యం
రహదారుల రాజసం
పకడ్బందీగా పారిశుద్ధ్యం
ఆదర్శ వైకుంఠ ధామం !క్రీడా ప్రాంగణాలు..పార్కులు..
ఓపెన్ జిమ్ లు… నర్సరీలు
సకల వసతుల సమగ్రాభివృద్ధి కేంద్రం!… pic.twitter.com/QYmjTRW8zC— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 23, 2023