హైదరాబాద్ : పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాల సదుపాయాలతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్న సంగతి తెలిసిందే. కామారెడ్డి జిల్లా జంగంపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లను అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఈ ఇండ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గ్రామీణ తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఎలా సాగుతుందో ఈ చిత్రాలు నిదర్శమని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఎలా సాగుతుందో ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతుందన్నారు. ఈ ఇండ్ల నిర్మాణం ఒక్క తెలంగాణకే కాదు.. దేశానికే ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
For those of you who are wondering how the #DignityHousing 2BHK program is faring in rural Telangana, please see below 👇
— KTR (@KTRTRS) June 18, 2021
The 2BHK Houses at Jangampally village of Kamareddy district are a matter of pride not just for #Telangana but is setting a benchmark for India 👍 pic.twitter.com/uiT9uJBRND