PSLV-C53 | ధృవ స్పేస్ బృందానికి మంత్రి కేటీఆర్ అభినందనలు
PSLV-C53 | పీఎస్ఎల్వీ సీ-53 మిషన్ ప్రయోగం విజయవంతంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ధృవ శాటిలైట్ ఆర్బిటల్ డిప్లొయర్ స్పేస్ క్వాలిఫై కావడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ధృవ స్పేస్ బృందానికి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ అభినందనలు తెలిపారు. భారతదేశపు తొలి ప్రయివేటు స్పేస్ స్టార్టప్ ధృవ స్పేస్ అని ఆయన పేర్కొన్నారు. ధృవ స్పేస్ తెలంగాణకు గర్వకారణమని కేటీఆర్ స్పష్టం చేశారు. జూన్ 30న ప్రయోగించిన PSLV-C53 యొక్క PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ (POEM)లో దృవ స్పేస్ సెంటర్ తయారు చేసిన ఉపగ్రహాలు స్పేస్ లోకి ఎగిరాయి.
2012లో ప్రారంభమైన ధృవ స్పేస్కి సీఈవో సంజయ్ నెక్కంటి నాయకత్వం వహిస్తున్నారు. ఇతనితో పాటు చైతన్య దొర, రాహుల్ రవి కుమార్, విశాల్ లత బాలకుమార్, అభయ్ ఏగూర్ , కృష్ణ తేజ బొర్డు సభ్యులుగా ఉన్నారు. ఏడాదికి దాదాపు 300 ఉపగ్రహాలను తయారు చేయగల సామర్థ్యంతో ధృవ స్కేల్లో శాటిలైట్లను తయారు చేయాలని యోచిస్తోంది.
A proud moment for #Telangana as India’s first private space startup @dhruvaspace has space-qualified their Satellite Orbital Deployer on @isro PSLV C53 mission on June 30
Congratulations to the team! pic.twitter.com/A9GA7MdAEY
— KTR (@KTRTRS) July 1, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

