
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 20వ శతాబ్దంలో సామాజిక న్యాయం ద్వారా దళితులకు విముక్తి కలిగిస్తే.. 21వ శతాబ్దంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆర్థిక సాధికారతతో వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. దళితుల ఆర్థిక స్వాలంబన కోసం మరో గొప్ప కార్యక్రమం దళిత బంధు ప్రారంభించబోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.
Bharat Ratna Dr BR Ambedkar's vision was Emancipation of Dalits through Social Justice in 20th Century
— KTR (@KTRTRS) August 16, 2021
Hon’ble CM KCR's effort is Dalit upliftment through Economic empowerment in 21st Century
Kudos to Sri #KCR Garu on yet another pioneering program #DalitBandhu #Telangana pic.twitter.com/Xg3yI0LT11