Minister KTR | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి అంశంపై కేటీఆర్ స్పందిస్తుంటారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర అంశాలపై కేటీఆర్ ట్వీట్లు చేస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని చిత్రాలను షేర్ చేసి ఇదే ఎక్కడో కనిపెట్టగలరా? అని నెటిజన్లను అడుగుతుంటారు. ఆ మధ్య కాలంలో ఐటీ హబ్, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫోటోలను షేర్ చేసిన కేటీఆర్.. తాజాగా మరో ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ప్రదేశం ఎక్కడ్నో గెస్ చేయగలరా? కేటీఆర్ అడిగారు.
కేటీఆర్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. గండిపేట పార్కు అని కొందరు పేర్కొన్నారు. మరికొందరేమో.. ఇది పక్కా తెలంగాణలోనే సార్ అంటూ సమాధానం ఇస్తున్నారు. మెజార్టీ నెటిజన్లు గండీపేట పార్కే అని చెబుతున్నారు.
Guess where this is ? pic.twitter.com/rFSUM4cCMM
— KTR (@KTRTRS) November 3, 2022