Minister KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో పోలింగ్ సరళిని భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR ) పర్యవేక్షించారు. నగరంలోని పలు పోలింగ్ బూత్ (polling centers)ల వద్దకు వెళ్లి అక్కడున్న అధికారులను ఓటింగ్ తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఓటేసేందుకు వచ్చిన ఓటర్లతో కూడా ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
Minister Ktr 2
మధ్యాహ్నం 1 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 36.68 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు (Voting percentage) ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.8 శాతం పోలింగ్ నమోదుకాగా.. అత్యల్పంగా హైదరాబాద్లో 20.79 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Minister Ktr 3
Also Read..
TS Assembly Elections | మెదక్ ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్.. 1 గంటకు 36.68 శాతం మేర పోలింగ్ నమోదు
TS Assembly Elections | కొనసాగుతున్న పోలింగ్.. తొలిసారి ఓటు వేస్తున్న యువత
TS Assembly Elections | అర్బన్ ఏరియాల్లో పోలింగ్ శాతం పెరగాలి : సీఈవో వికాస్ రాజ్