రాణి వాసంలోన రంజిల్లు రాజా, రైతు బాధలు తీర్చి రక్షించలేవా, పట్టణపు సొగసుకై పాటుపడు రాజా, పల్లెకందం గూర్చు ప్రతిభయేలేదా.. అని ప్రజాకవి కాళోజీ పల్లెల గురించి ఆవేదనతో రాశారు. ఇప్పుడు తెలంగాణ పల్లె మురిసిపోతుంది, పట్టణం మెరిసిపోతుంది. కేంద్రమే అవార్డుల రూపంలో చెప్తున్నది.
సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో టాప్-20 గ్రామాలు ఎక్కడా ఉన్నాయంటే 19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. పట్టణాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో దేశంలోనే 26 అవార్డులతో రెండో స్థానంలో తెలంగాణ ఉన్నది. ఢిల్లీలో ఉన్న వాళ్లు అవార్డులు ఇస్తారు, గల్లీలో ఉన్న వాళ్లు విమర్శలు చేస్తారు. 1100 కోట్లు విడుదల చేయకుండా తొక్కి పెడుతుంది కేంద్ర ప్రభుత్వమే. సర్పంచులకు మీరే బకాయి ఉన్నారు.
-మంత్రి కేటీఆర్