హైదరాబాద్ : తెలంగాణకు ఐటీఐఆర్‌పై కేంద్రం పునరాలోచన చేయాలి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో 24వ జాతీయ ఈ – గవర్నెన్స్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ-పాలనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో ఐటీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ ఎగుమతులతో పాటు ఎలక్ట్రానిక్ సర్వీసుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని కేటీఆర్ తెలిపారు.
సామాజిక దృక్పథం లేని సాంకేతికత వ్యర్థం అని కేటీఆర్ పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీల కోసం టీ వ్యాలెట్ తీసుకొచ్చామన్నారు. ఈ – గవర్నెన్స్‌తో పాటు ఎం – గవర్నెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చామని స్పష్టం చేశారు. టీ యాప్ ద్వారా రోజుకు 270కి పైగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సమస్యలను అధిగమించామని చెప్పారు. స్మార్ట్ ఫోన్ ద్వారా పౌర సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఫెస్ట్ యాప్ ద్వారా రవాణా శాఖలో 17 సేవలందిస్తున్నామని తెలిపారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నాం. టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా ఇంటర్నెట్ సేవలందిస్తున్నాం. 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. 80 లక్షల గృహాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నామని పేర్కొన్నారు. మరో రెండు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు కేటాయించాలి అని కేంద్రాన్ని కేటీఆర్ కోరారు.
Union MoS (Independent Charge) of the Ministry of Science and Technology @DrJitendraSingh & Telangana State IT Minister @KTRTRS along with other dignitaries released the Conference papers, and Excellence in e-Governance Booklet at the 24th National conference on e-Governance. pic.twitter.com/VUeSag3pko
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 7, 2022