హైదరాబాద్ : మొబైల్ ఐసీయూ బస్సులను మంత్రి కేటీఆర్ గురువారం ట్యాంక్‌బండ్‌పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో మెడికల్ యూనిట్ బస్సుల ప్రారంభం సంతోషంగా ఉందన్నారు. తొలి విడుత రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించినట్లు కేటీఆర్ వెల్లడించారు. కొవిడ్ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. దేవుడితో సమానంగా హెల్త్‌కేర్ వర్కర్లను చూస్తున్నారని పేర్కొన్నారు.
మెడికల్ యూనిట్ బస్సులో వైద్య సేవల కోసం ఒక డాక్టర్, ఇద్దరు నర్సులతో పాటు 10 బెడ్లు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్ చర్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. బస్సులను ప్రారంభించిన అనంతరం బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను కేటీఆర్ పరిశీలించారు.
The Mobile ICU B.SOZO buses have facilities such as 10 oxygen supported beds,dedicated monitoring system, CCTV & video for live interaction and capturing, Duty Doctors, nursing staff and ward members, technician etc. pic.twitter.com/R3HL5XzK46
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 3, 2021