హైదరాబాద్ : జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్వితీయ ప్రగతి సాధించిందని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డులు తిరగరాసిందని స్పష్టం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ మన రైతన్నలను ఇబ్బందులకు గురిచేస్తోంది అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టమైన పాలసీ ప్రకటించాలని, రైతన్నలను ఇబ్బందులకు గురిచేయవద్దు అని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసిందని గుర్తు చేశారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.. రాష్ట్ర బాగుంటే దేశం బాగుంటుంది అనేదే మా విధానం అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
My warmest wishes to the farmers of our great nation who feed us & inspire us everyday
— KTR (@KTRTRS) December 23, 2021
యావత్ రైతాంగానికి జాతీయ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు. 🙏#NationalFarmersDay pic.twitter.com/aJtnruqrgK