హైదరాబాద్ : బయో ఏషియా సదస్సులో భాగంగా గురువారం బిల్ గేట్స్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బిల్ గేట్స్‌తో జరిగిన సంభాషణను ఎంజాయ్ చేశాను అని కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్‌కు ఉన్న అద్భుత అవకాశాలను బిల్ గేట్స్‌కు పరిచయం చేశాను అని పేర్కొన్నారు. ఈ అవకాశం తనకు కల్పించిన బిల్ గేట్స్‌కు మినిస్టర్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు.
లైఫ్సైన్సెస్లో హైదరాబాద్ ఎంతో పురోగతి సాధిస్తున్నదని బిల్, మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కొనియాడిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని వ్యాక్సిన్ కంపెనీలు ఒక్క భారత్‌కే కాకుండా ప్రపంచానికి వ్యాక్సిన్ అందించాయని హర్షం వెలిబుచ్చారు. హైదరాబాద్ వచ్చి వ్యాక్సిన్ కంపెనీలకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఆతృతగా ఉన్నానని పేర్కొన్నారు. కరోనా కారణంగా రెండేండ్లుగా ఎక్కడికీ వెళ్లడంలేదని, అవకాశం దొరికినప్పుడు తప్పకుండా హైదరాబాద్‌కు వస్తానని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ల తయారీలో భారత్ కృషి ఎంతో అమోఘమని, చాలా సంపన్న దేశాలకంటే ఎంతో మెరుగ్గా భారత్ వ్యాక్సిన్లను తయారుచేసి తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చిందని ప్రశంసలు కురిపించారు.
Thoroughly enjoyed my conversation with @billgates on #Healthcare & #Technology as part of our annual flagship event @BioAsiaofficial
Also introduced to him the vibrant #LifeSciences ecosystem of #Hyderabad
Thank you, Bill, for this fascinating opportunity! @BMGFIndia pic.twitter.com/RJlkAwkIYx
— KTR (@KTRTRS) February 25, 2022