Dharani portal | రాజకీయ కక్షతోనే ధరణి పోర్టల్‌ను రద్దు చేశారు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
రణి పోర్టల్(Dharani portal) బ్రహ్మాండంగా నడిస్తుంటే రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తెచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
జనగామ : ధరణి పోర్టల్(Dharani portal) బ్రహ్మాండంగా నడిస్తుంటే రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తెచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. జనగామ మున్సిపల్ అభివృద్ధిపై ఎంఎల్ఏ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భూభారతిలో స్కాం వందలా..వేల కోట్లా తేల్చాల్సి ఉందన్నారు. మీడియా వల్లే ప్రభుత్వం హై పవర్ కమిటీ వేసింది. దాని వెనుక ఉన్నది ఎవరన్నది సమగ్ర విచారణ జరిపి డబ్బులను రికవరీ కవరీ చేసి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తప్పుల తడకగా ఉన్న భూ భారతిని తొలిగించి ధరణి పేరు కొనసాగించాలన్నారు. భూభారతిలో మీ సేవా నిర్వాహకులు, సంబంధిత అధికారులు కుమ్మక్కై కోట్లు కొల్లగొట్టారు. చలానాలు చెల్లించిన రైతులు, కొనుగోలుదారులకు డబ్బు రికవరీకి నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎవరైతే అక్రమాలు చేశారో వారి దగ్గర వసూలు చేసి ఖజానాకు చెల్లించాలన్నారు. భూభారతి స్కాంకు బాధ్యత రెవెన్యూ మంత్రి బాధ్యత వహించాలన్నారు.
అమాయకులకు అండగా ఉంటాం
పోరాడి సాధించయకున్న జనగామ జిల్లాను రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఎమ్మెల్యేలు కడియం, నాయిని కలిసి రద్దుకు కుట్ర చేస్తున్నారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. జిల్లాను మూసేస్తే మీ ప్రభుత్వం మూత పడుతదని హెచ్చరించారు. జనరల్ ఫండ్‌లో 4 కోట్లుంటే బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసుకున్నాం.
మరో 19.5 కోట్లు వచ్చాయి. వాటితో పట్టణ ప్రకృతి వనాలు, 60 ఫీట్ల రోడ్డు, వైకుంఠ ధామం రిపేర్ చేసుకోవాల్సి ఉందన్నారు. ఏ వార్డుల్లో పనులు ఏ విధంగా ఉన్నాయోనని రివ్యూ చేసి మార్పులు చేర్పులు చెస్తామన్నారు. మున్సిపల్లో పారిశుధ్యం, లైట్లు, మొక్కలకు నీళ్లు, చెత్త సేకరణ చేపట్టాలని చెప్పాం. ఉన్న చెట్లు ఎండిపోకుండా చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

