Washington Sundar: వాషింగ్టన్ సుందర్ ఔట్.. వన్డే జట్టులోకి ఆయుష్ బదోని
Washington Sundar : కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ పక్కటెముకల్లో గాయమైంది. దీంతో అతన్ని వన్డే సిరీస్ నుంచి తప్పించారు. అతని స్థానంలో ఆయుష్ బదోనిని జట్టులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar).. న్యూజిలాండ్‌తో వడోదరలో జరిగిన తొలి వన్డేలో గాయపడ్డ విషయం తెలిసిందే. అతని పక్కటెముకల్లో తీవ్ర గాయమైంది. ఈ నేపథ్యంలో కివీస్‌తో జరిగే వన్డే సిరీస్ నుంచి అతన్ని తప్పించారు. రెండు జట్ల మధ్య మరో రెండు వన్డేలు జరగాల్సి ఉన్నది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5 ఓవర్లు వేసి 27 రన్స్ ఇచ్చిన సుందర్ .. గాయం వల్ల మళ్లీ ఫీల్డింగ్ చేయలేదు. అయితే బ్యాటింగ్ కోసం మాత్రం అతను 8వ నెంబర్లో ఎంట్రీ ఇచచాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు అతను.
పరుగెత్తడానికి ఇబ్బంది పడ్డా.. గెలుపు కోసం సుందర్ క్రీజ్‌లోకి దిగాల్సి వచ్చింది. కీలక దశలో అతను రాహుల్‌కు అండగా నిలిచాడు. ఎడమ వైపు పక్కటెముకల్లోని కింద భాగంలో సుందర్ నొప్పితో బాధపడుతున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కివీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికై గాయపడ్డ మూడవ ప్లేయర్‌గా సుందర్ నిలిచాడు. వికెట్‌కీపర్,బ్యాటర్ రిషబ్ పంత్ వెన్ను నొప్పి కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇక బ్యాటర్ తిలక్ వర్మ కు సర్జరీ కావడం వల్ల అతను కూడా వన్డే సిరీస్‌కు దూరం అయ్యాడు.
ఫస్ట్ వన్డేలో ఇండియా నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆయుష్ బదోనిని తీసుకున్నారు. రాజ్‌కోట్‌లో కివీస్‌తో జరిగే రెండో వన్డే కోసం జట్టుతో బదోని కలవనున్నాడు.
🚨 News 🚨
Washington Sundar ruled out of #INDvNZ ODI series; Ayush Badoni receives maiden call-up.
Details ▶️ https://t.co/ktIeMig1sr #TeamIndia | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) January 12, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

