హైదరాబాద్ : అన్నా- చెల్లెళ్ళు, అక్కా – తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ ను పురస్కరించుకొని పలువురు మహిళా నేతలు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుకు రాఖీ కట్టారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి తదితర మహిళా నేతలు మంత్రి కేటీఆర్కు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. రాఖీలతో నిండిపోయిన తన చేతిని చూపిస్తూ అందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రియ సోదరిమణులకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.
Happy #Rakshabandhan all
— KTR (@KTRTRS) August 22, 2021
Thanks to all my loving sisters 😊 pic.twitter.com/6wA50bIbrc