హైదరాబాద్ : టాటా గ్రూప్ చైర్మన్, భారతీయ పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన రతన్ టాటా జన్మదినం ఈ రోజు. ఈ సందర్భంగా రతన్ టాటాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పలు సందర్భాల్లో రతన్ టాటాతో కొంత సమయం గడిపే అదృష్టం తనకు కలిగిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించడం, వినయం, హాస్యచతురత ఆయనలో కనిపిస్తాయని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇవన్నీ తనకు స్ఫూర్తినిస్తాయని కేటీఆర్ చెప్పారు.
I’ve had the good fortune of spending some time with Sri @RNTata2000 on several occasions
Have always found his humility, sense of humour and amazing focus on entrepreneurship inspiring
Happy Birthday to Ratan Ji. Stay blessed sir pic.twitter.com/ZudhM6QLdp
— KTR (@KTRTRS) December 29, 2022