హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పథకాల అమలుకోసం అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం పోస్ట్చేసిన ఓ ట్వీట్‌కు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా జవాబిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు ఇస్తామన్న హామీ అమలుకోసం ప్రజలంతా బీజేపీ నేతలకు దరఖాస్తులు పంపించాలని పిలుపునిచ్చారు. ‘ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రతి పౌరుడికి రూ.15 లక్షల కోసం తెలంగాణ బీజేపీ దరఖాస్తులు ఆహ్వానించటాన్ని నేను స్వాగతిస్తున్నా! ఈ ప్రయోజనాన్ని ధనాధన్ మీ జన్‌ధన్ ఖాతాల్లో పొందాలంటే అర్హులైన తెలంగాణ ప్రజలందరూ బీజేపీ నాయకులకు దరఖాస్తులు పంపించండి’ అని పోస్ట్ చేశారు. బండి సంజయ్ ట్వీట్‌పై పలువురు ఎద్దేవాచేశారు. స్పందించారు. నెటిజన్లు మోదీ ఇస్తామన్న రూ.15 లక్షలు ఎక్కడ? మోదీ ఎన్నికల్లో ప్రకటించిన జుమ్లా ప్యాకేజీలేనా అంటూ రిప్లయ్‌లు ఇచ్చారు. బండి సంజయ్ 15 లక్షలు ఇప్పిస్తే తామూ బీజేపీ చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములవుతామని కరీంనగర్ పార్లమెంట్ ఓటర్ చేరాల నిఖిల్ కుమార్ పేర్కొన్నారు.