తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజా ప్రజ్వల్ అనే ఓ చిన్న కుర్రాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఉద్యమ చరిత్ర, సీఎం కేసీఆర్ పోరాటం గురించి తడబడకుండా వివరించాడు. తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకుపోతున్నదని చెప్పాడు. ఈ వీడియో చూసి మంత్రి కేటీఆర్ ముగ్ధుడయ్యారు. ఈ పిల్లోడికి ఉన్న తెలివి మన ప్రతిపక్ష నాయకులకు లేదంటూ ట్వీట్ చేశారు. ఎవరీ కుర్రాడు? అంటూ అతడి వీడియోను రీట్వీట్ చేశారు.
ఈ వీడియోలో రాజా ప్రజ్వల్ తెలంగాణ ఉద్యమం..కేసీఆర్ దీక్ష..అభివృద్దిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ గురించి ఎక్కడా తడబడకుండా వివరించాడు. ”ఎందరో చేసిన పోరాటం.. మరికొందరి బలిదానం.. ఫలితమే మన తెలంగాణ రాష్ట్రం. జూన్ 2, 2014 తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారమైన రోజు. 58 ఏళ్ల వివక్షకు తెరపడిన రోజు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మన తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు. మన తెలంగాణ తల్లికి విముక్తి కలిగిన రోజు. తొలిదశ తెలంగాణ ఉద్యమం 1969లో మొదలైంది. కానీ ఉద్యమాన్ని అతి బలంగా మార్చిన వ్యక్తి మన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఆయన 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి, అత్యంత పట్టుదలతో శ్రమించి, ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రియమైన ప్రజలకు అందించారు. తెలంగాణ మనదేశంలో 29వ రాష్ట్రం. తెలంగాణ సాధించిన వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రం అన్నిరంగాల్లో దూసుకుపోతున్నది. ఎంతో అభివృద్ధి సాధించింది. రాష్ట్రాన్ని, తన ప్రజలను ఎంతో ప్రేమగా పాలిస్తున్న మన కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. జైహింద్.. జై తెలంగాణ..” అని అతడు తన ప్రసంగాన్ని ముగించాడు.
👏👏👏 who is this little guy? https://t.co/Jdc4CyPX9I
— KTR (@KTRTRS) June 2, 2022