100 lies of BJP | హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తున్న బీజేపీ అసలు రూపాన్ని ‘బీజేపీ 100 అబద్ధాలు’ పేరుతో ముద్రించిన పుస్తకంలో బట్టబయలు చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఈ బుక్లెట్, సీడీ ద్వారా బీజేపీ తప్పులను, వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను తెలియజేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం రూపొందించిన పుస్తకం, సీడీని మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో సోమవారం ఆవిషరించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు మన్నె క్రిషాంక్, వై సతీశ్‌రెడ్డి, జగన్మోహన్రావు, దినేశ్‌చౌదరి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోదీ సరారు ఎలా మోసం చేసింది? తెలంగాణ ప్రజలకు హకుగా రావాల్సిన వాటిని ఎలా అడ్డుకుంటున్నారనే విషయాలను వాటిలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ 100 అబద్ధ్దాలివీ..
1. బీజేపీ నారాయణపేటలో చేనేత పార్కు మంజూరు చేస్తుంది: అమిత్ షా, కేంద్ర మంత్రి
2. రైల్వే కోచ్ ఫ్యాక్జరీని కచ్చితంగా కాజీపేటలో ఏర్పాటుచేస్తాం:కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి
3. ఆదిలాబాద్‌లో సిమెంట్ ప్లాంట్‌ను కేంద్రం ఏర్పాటుచేస్తుంది: అమిత్ షా
4. తెలంగాణలో కొత్తగా మూడు ఎయిర్‌పోర్ట్‌లను ఏర్పాటు చేస్తాం: కిషన్‌రెడ్డి
5. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం: కిషన్‌రెడ్డి
6. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటుచేస్తాం: బండారు దత్తాత్రేయ
7. మాదిగలకు న్యాయం చేస్తాం. ఎస్సీ వర్గీకరణను చేపడుతాం: వెంకయ్యనాయుడు
8. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
9. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం: బండారు దత్తాత్రేయ
10. తెలంగాణలో సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను ఏర్పాటు చేస్తాం: కిషన్‌రెడ్డి
11. కేంద్ర బృందం రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించింది. కేంద్రం వరద సహాయాన్ని అందిస్తుంది: కిషన్‌రెడ్డి
12. ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయాలనేది నా కల: మోదీ
13. నాగార్జునసాగర్‌లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటా: కిషన్‌రెడ్డి
14. హైదరాబాద్ మెట్రోకు రూ.16 వేల కోట్లు ఇస్తామని ప్రధాని మోదీ 2016లోనే హామీ ఇచ్చారు: అమిత్ షా
15. వెనకబడిన జిల్లాల్లో భాగంగా సిద్దిపేటకు ఒక మెడికల్ కాలేజీ ఇస్తారు: రఘనందన్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే
16. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఇండ్లను నిర్మిస్తాం: ధర్మపురి అరవింద్, ఎంపీ
17. హుజూర్నగర్ నియోజకవర్గాన్ని రూ.1000 కోట్లతో అభివృద్ధి చేస్తాం: హుజూర్నగర్ బీజేపీ అభ్యర్థి కోటా రామారావు
18. కంటోన్మెంట్ అభివృద్ధికి రక్షణ శాఖ నుంచి రూ.700 కోట్లు తీసుకొస్తాం: బండి సంజయ్, ఎంపీ
19. మోదీ ప్రభుత్వం సంక్రాంతి నుంచి బీడీ కార్మికులకు రూ. 3 వేల పింఛన్ ఇస్తుంది: రఘనందన్‌రావు, ఎమ్మెల్యే
20. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌ను కేంద్రం మంజూరు చేస్తుంది: సోయం బాపూరావు, ఎంపీ
21. కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పిస్తాం: నరేంద్రమోదీ
22. తెలంగాణ ప్రాజెక్టులకు, మిషన్ కాకతీయకు జాతీయ హోదా కల్పిస్తాం, మిషన్ కాకతీయకు మద్దతు ఇస్తాం: ఉమా భారతి.
23. ఇతర దేశాల్లో ఉన్న భారతదేశ బ్లాక్ మనీని వెనక్కి తీసుకరావడానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేస్తాం. ఆ డబ్బును నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి బదిలీ చేస్తాం: నరేంద్రమోదీ
24. మిషన్ భగీరథను ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది: రామ్‌కృపాల్ యాదవ్
25. ప్రతి మండల కేంద్రంలో ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తాం. దీని ద్వారా మహిళలు ఉద్యోగాలు పొందుతారు: కిషన్‌రెడ్డి
26. మోదీకి ఓటు వేస్తే తెలంగాణలోని చక్కెర మిల్లులను తెరుస్తాం: ధర్మపురి అర్వింద్
27. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఉచిత ఇండ్లను ఇస్తాం: అమిత్ షా
28. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం: నరేంద్రమోదీ
29. తెలంగాణకు నాలుగు ఫుడ్ పార్కులను మంజూరు చేస్తాం. రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది: సాధ్వి నిరంజన్ జ్యోతి
30. కేంద్రం గోదావరి నదిపై డ్రై పోర్టును నిర్మిస్తుంది: కిషన్‌రెడ్డి
31. ప్రతి ఇంటికి 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తాం: నరేంద్రమోదీ
32. వరంగల్‌లో పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం: సంతోష్ గంగ్వార్
33. దీపావళి, హోలీ సందర్భంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాం: అమిత్ షా
34. హైదరాబాద్ – నాగార్జునసాగర్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటుచేస్తాం: కిషన్‌రెడ్డి
35. ప్రతి రైతుకు ఉచితంగా నాగలి, రెండు ఎద్దులు ఇస్తాం: రఘనందన్‌రావు
36. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం: బండారు దత్తాత్రేయ
37. అదనంగా రీజినల్ ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తాం. దీని ద్వారా వర్తక వాణిజ్యం, ఐటీ, పర్యాటకానికి ఎంతో ఉపయోగపడుతుంది: కిషన్‌రెడ్డి
38. రైతులకు ఉచితంగా బోర్వెల్ మంజూరు చేస్తాం: కే లక్ష్మణ్
39. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలను తీసుకొస్తుంది. దీని ద్వారా కల్వకుర్తిలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: అమిత్ షా
40. ప్రతి రైతు రుణంపై వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది: కే లక్ష్మణ్
41. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేరుస్తాం: కే లక్ష్మణ్
42. కేంద్రం హైదరాబాద్, వరంగల్‌లో సైన్స్ సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది: కిషన్‌రెడ్డి
43. కేంద్రం 2022 నాటికి ఇండ్ల్లు లేని వారికి ఇండ్లను కట్టిస్తుంది. కట్టివ్వలేని వారికి ఇంటి అద్దెను చెల్లిస్తుంది: ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి వినయ్ కుమార్‌రెడ్డి.
44. తెలంగాణలో ఐఐఎంను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ అడిగింది. కేంద్రం దీనికి అంగీకరించింది: కే లక్ష్మణ్
45. తెలంగాణలో ప్రతి జిల్లాలో నవోదయలను ఏర్పాటు చేయాలని బీజేపీ అడిగింది. కేంద్రం సానుకూలంగా స్పందించింది: కే లక్ష్మణ్
46. ప్రతి కుటుంబానికి ఒక తులం బంగారం ఇస్తాం: ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి వినయ్ కుమార్‌రెడ్డి
47. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించడానికి అన్ని శాఖలను సమన్వయం చేస్తాం: బండారు దత్తాత్రేయ
48. రైతులకు ఎంఎస్పీతో పాటుగా బోనస్ కూడా అందిస్తాం: కే లక్ష్మణ్
49. రక్షణ శాఖ తన భూములను ప్రజా అవసరాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది: బండారు దత్తాత్రేయ
50. మదాసి కురువ కులాన్ని ఎస్సీల్లో చేరుస్తాం: కే లక్ష్మణ్
51. డిగ్రీ చదువుకునే ప్రతి అమ్మాయికి ఉచితంగా ద్విచక్ర వాహనాన్ని అందిస్తాం: అమిత్ షా
52. పత్తి కనీస మద్దతు ధరను రూ.5200 నుంచి రూ.10 వేలకు పెంచాం: జేపీ నడ్డా
53. హైదరాబాద్‌లో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ను ఏర్పాటుచేస్తాం: అమిత్ షా
54. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం: అమిత్ షా
55. మా ప్రభుత్వం ప్రతి కిలో పార్బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేస్తుంది: అమిత్ షా
56. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఇచ్చింది: ప్రహ్లాద్ జోషి
57. గజ్వేల్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం: అమిత్ షా
58. హైదరాబాద్‌కు సైన్స్ సిటీని ఇచ్చాం: అమిత్ షా
59. ఆర్థికంగా వెనకబడిన పేద అమ్మాయిలకు రూ.25 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తాం: జేపీ నడ్డా
60. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం: అమిత్ షా
61. పాతబస్తీలో 100 పడకల దవాఖాన ఏర్పాటు చేస్తాం: బండారు దత్తాత్రేయ
62. ప్రతి జిల్లాలో కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర బీజేపీ కోరింది: కే లక్ష్మణ్
63. ఓబీసీ, ఎస్సీ గణనల ద్వారా జనాభా ప్రాతిపదికన వారికి న్యాయం జరుగుతుంది: సంగమిత్ర మౌర్య
64. కార్పొరేషన్ల ద్వారా హస్తకళల కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాం: బండారు దత్తాత్రేయ
65. పేదవారికి ఇండ్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం: బీజేపీ సంగారెడ్డి అభ్యర్థి రాజేశ్వర్‌రావు
66. కోరుట్లలో బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ దవాఖాన నిర్మించడానికి కేంద్రం అంగీకరించింది: బీజేపీ కోరుట్ల అభ్యర్థి జేఎన్ వెంకట్
67. నారాయణపేటలో కేంద్ర ప్రభుత్వం పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి: నారాయణపేట బీజేపీ అభ్యర్థి పాండురెడ్డి
68. సిద్దిపేటను ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చడానికి మోదీ సహాయం చేస్తారు. దీని ద్వారా 10వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి: సిద్దిపేట బీజేపీ అభ్యర్థి నరోత్తంరెడ్డి
69. కేంద్రం వరంగల్‌లో 100 పడకల ఈఎస్ఐ దవాఖాన నిర్మిస్తుంది: బండారు దత్తాత్రేయ
70. కేంద్రం వరంగల్‌లో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తుంది దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల ఉద్యోగాలు లభిస్తాయి: బీజేపీ అభ్యర్థి ధర్మారావు
71. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం: నరేంద్రమోదీ
72. కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. గిరిజనులకు 9.8 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంది: రవీంద్ర నాయక్ మాజీ ఎంపీ
73. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా మానకొండూరు యువతకు 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి: బీజేపీ అభ్యర్థి గడ్డం నాగరాజు
74. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గగానే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. దీని ద్వారా నిత్యావసరాల ధరలు తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
75. ప్రతి గ్రామీణ నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ సెంటర్‌ను, స్కిల్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా ఉద్యోగాలు వస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి బ్యాంకు రుణాలు అందిస్తాం: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్‌రెడ్డి.
76. ప్రతి సంవత్సరానికి ఒక ఐఐఎం, ప్రతి రోజు కొత్త ఐటీఐ, ప్రతి రెండు రోజులకు ఒక సెంట్రల్ కాలేజీ, ప్రతి వారం ఒక సెంట్రల్ యూనివర్సిటీ, ప్రతి మూడు రోజులకు ఒక అటల్ ల్యాబ్‌ను ప్రారంభిస్తాం: నరేంద్రమోదీ
77. రాచకొండను పర్యాటక ప్రాంతంగా (హబ్) ఏర్పాటు చేస్తాం: బండారు దత్తాత్రేయ
78. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ను కేంద్రం నిర్మిస్తుంది: కిషన్‌రెడ్డి
79. రాబోయే ఐదేండ్లలో లక్ష గ్రామాలను డిజిటలైజ్ చేస్తాం: పీయూష్ గోయల్
80. హైదరాబాద్‌లో లక్ష ఇండ్లకు పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం: ధర్మేంద్ర ప్రధాన్
81. చార్మినార్, గోల్కొండలను అభివృద్ధి చేయడానికి కేంద్రం నిధులు ఇస్తుంది: కిషన్‌రెడ్డి
82. దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రత్యేక నిధులు ఇస్తుంది: రఘనందన్‌రావు
83. గొల్ల, కుర్మలను ఎస్సీల్లో చేరుస్తాం: బండారు దత్తాత్రేయ
84. జీఎస్టీకి ముందు ప్రతి వస్తువుపై అధిక పన్నులు ఉన్నాయి. జీఎస్టీ తరువాత పన్నులు లేవు: నరేంద్రమోదీ
85. చేనేతపై జీఎస్టీని తగ్గిస్తాం: జేపీ నడ్డా
86. బోనాల పండుగను జాతీయ పండుగగా ప్రకటిస్తాం: కిషన్‌రెడ్డి
87. గోదావరి నదిపై వాటర్ వేలను ఏర్పాటుచేస్తాం: నితిన్ గడ్కరీ
88. డిచ్‌పల్లిలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి: బండారు దత్తాత్రేయ
89. ఆర్మూర్‌లో ఈఎస్ఐ దవాఖాన ఏర్పాటుచేస్తాం: బండారు దత్తాత్రేయ
90. ప్రధానమంత్రి స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తాం: నాగార్జునసాగర్ బీజేపీ అభ్యర్థి నివేదిత
91. వ్యవసాయ కూలీలకు శిక్షణ ఇస్తాం. కోటి మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం: బండారు దత్తాత్రేయ
92. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాం: అమిత్ షా
93. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే 1000 పింఛన్‌ను 3 వేలకు పెంచుతాం: రఘనందన్‌రావు
94. బీజేపీ వ్యవసాయ కూలీలకు కేంద్రం రూ. 3 వేల పింఛన్ ఇస్తుంది: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి
95. సంగారెడ్డి నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం. దీని ద్వారా 25 నుంచి 30వేల మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి: బీజేపీ అభ్యర్థి రాజేశ్వర్‌రావు
96. ఉర్దూ భాషకు రిజర్వేషన్, ప్రోత్సాహం కల్పిస్తాం: మురళీమనోహర్ జోషి
97. దేశంలోని ప్రతి గ్రామానికి బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తాం: నరేంద్రమోదీ
98. బీజేపీ ప్రభుత్వం రాగానే రైతులకు రుణాలు ఇవ్వడం ప్రథమ ప్రాధాన్యతగా పెట్టుకుంటాం: నరేంద్రమోదీ
99. రైల్ నెట్‌వర్క్‌ను ఆధునీకరిస్తాం. హై స్పీడ్ ట్రైన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా దేశం మరింత అభివృద్ధి చెందుతుంది: నరేంద్రమోదీ
100. లంచాలు తీసుకునే ఎవ్వరినీ బీజేపీ ప్రభుత్వం ఉపేక్షించదు. అవినీతిని నిర్మూలిస్తాం: నరేంద్రమోదీ