హైదరాబాద్: జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలంటూ మంత్రి ట్వీట్ చేశారు.
‘సికింద్రాబాద్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చాలా మంది కోరుతున్నారు. విలీనం చేయాలనే వాదనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరి మీరేమంటారు?’ అని ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు.
Read a couple is news reports today where citizens overwhelmingly opined that Secunderabad Cantonment Board has to be merged in GHMC
— KTR (@KTRTRS) September 22, 2021
I am in agreement too. What do you guys say?