ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు
మంత్రి కేటీఆర్ | చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి

హైదరాబాద్ : చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. సాయి కిరణ్ అనే ఓ నెటిజన్.. వారిని ఆదుకోవాలంటూ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఆ ముగ్గురికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆ ముగ్గురు పిల్లలను ఆదుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్, చొప్పదండి ఎమ్మెల్యేకు కేటీఆర్ సూచించారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు ఎమ్మెల్యే రవి శంకర్ తక్షణమే స్పందించారు. మల్యాల మండలం ఓగుళాపూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు అనారోగ్యంతో చనిపోయారు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అక్షర, సాహిత్య, హర్షవర్ధన్ ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారు.
మంత్రి కేటీఆర్ సూచనలతో ఎమ్మెల్యే రవిశంకర్.. గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి తక్షణ సహాయం కింద రూ. లక్ష ఆర్థిక సహాయం చేశారు. మంత్రి కేటీఆర్ చెప్పిన విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. పిల్లలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జనగం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మధుసూదనారావు, జిల్లా కో అప్షన్ సుభాను, మండల కో అప్షన్ అజారుద్దీన్, సర్పంచ్ సరోజన మల్లేశం, ఎంపీటీసీ భూపతి రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Many thanks MLA Garu 👏 https://t.co/lCycFq0D6R
— KTR (@KTRBRS) June 14, 2021
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

