ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. ఉదయం పేపర్ వేస్తూ ఇంటి ఖర్చులకు డబ్బు సంపాదించుకుంటున్న ఓ విద్యార్థి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ అబ్బాయి పేపర్ వేస్తుండగా.. ఓ వ్యక్తి అతన్ని పలుకరించాడు. ఈ వయసులో పేపర్ ఎలా వేస్తావు.. ఆయన అడగ్గా.. చదువుకుంటూ పేపర్ వేస్తే తప్పేంటని సదరు విద్యార్థి సమాధానం ఇచ్చాడు.
ఈ వీడియోను చూసిన కేటీఆర్ సైతం ఆ విద్యార్థిని అభినందించారు. జగిత్యాలకు చెందిన జయప్రకాశ్ అనే విద్యార్థిలో ఆత్మవిశ్వాసం చూసి చాలా సంతోషపడ్డానని కేటీఆర్ ట్వీట్ చేశారు. చదువుకుంటూ పని చేయడంలో త్పపేంటన్న అతని సమాధానం భవిష్యత్లో మంచి స్థితిలో ఉంటాడు అని కేటీఆర్ ఆకాంక్షించారు.