ఇది నిజమైన గ్రామీణాభివృద్ధి అంటే.. ఎర్రబెల్లి దయాకర్ రావుకు కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్ : రాష్ట్రంలో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులు గ్రామాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ పథకం అమలుతో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన ర్యాంకులను కేంద్రం ఇటీవల ప్రకటించింది. టాప్ టెన్ ర్యాంకుల్లో తెలంగాణ ఏడు ర్యాంకులను కైవసం చేసుకుంది. దేశంలోని తొలి ఆదర్శ గ్రామంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వెన్నపంల్లి గ్రామం నిలిచింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్పల్లి రెండో స్థానంలో, కందకుర్తి ఐదో స్థానంలో, తానాకుర్ద్ పదో స్థానంలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం నాలుగో స్థానంలో, వీర్నపల్లి ఆరో స్థానంలో, రామకృష్ణాపూర్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో నిజమైన గ్రామీణాభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో తొలి 10 గ్రామాల్లో 7 తెలంగాణకు చెందినవే అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న పల్లె ప్రగతి వల్లే ఇది సాధ్యమైంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Now this is called Real Rural Development!
7 villages out of top 10 villages in the country under Saansad Adarsh Gram Yojana are from #Telangana 👍
Kudos to Hon’ble CM KCR’s brainchild “PallePragathi” & my compliments to Panchayat Raj Minister @DayakarRao2019 Garu & his team👏 pic.twitter.com/y5KC1fV3K3
— KTR (@KTRBRS) February 8, 2022
కాగా, ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. ‘పల్లె ప్రగతి కార్యక్రమం పల్లెల ప్రగతికి పట్టం కట్టింది. ఆ ఫలాలు ఇప్పుడు ప్రతిఫలిస్తున్నాయి. తెలంగాణ గ్రామాలు సమగ్రంగా స్వయం సమృద్ధిగా మారుతున్నాయి. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ కార్య దీక్షా దక్షులు సీఎం కేసీఆర్ , అనునిత్యం ప్రోత్సహిస్తున్న మంత్రి కేటీఆర్ గారికి కృతజ్ఞతలు! ధన్యవాదాలు!! ఈ మహా యజ్ఞంలో కష్ట పడిన మా అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికీ పేరు పేరునా శుభాకాంక్షలు! అభినందనలు” అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు రీ ట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

