హైదరాబాద్ : రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా అభినందించారు. ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు బాల రక్షక్ వాహనాలను ప్రారంభించడాన్ని కేటీఆర్ ప్రశంసించారు. సీఎస్ఆర్ ప్రోగ్రాం కింద ఈ వాహనాలను కంట్రిబ్యూట్ చేసిన కార్పొరేట్స్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకొకటి చొప్పున 33 బాల రక్షక్ వాహనాలను నిన్న ప్రారంభించారు. 1098కి డయల్ చేస్తే వెంటనే ఆదుకునేలా ఏర్పాట్లు చేశారు.
మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు మంత్రి సత్యవతి రాథోడ్ రిప్లై ఇచ్చారు. థ్యాంక్స్ అన్న అంటూ ట్వీట్ చేశారు సత్యవతి రాథోడ్. సమర్థవంతమైన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో పాటు మీ మద్దతు, సలహాల ద్వారానే ఈ కార్యక్రమం సాధ్యమైందన్నారు. పిల్లల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
Many thanks anna. This was possible only because of the able leadership of Hon’ble CM Sri KCR garu and your continuous support and guidance. Safety of children has been our top priority. https://t.co/svwN1cV7C0
— Satyavathi Rathod (@SatyavathiTRS) November 15, 2021