హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయడం వల్ల రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడంలో విజయం సాధించామని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ రెండు పథకాల కింద 10 లక్షల మందికి పైగా అమ్మాయిల వివాహాలకు రూ. 9,072 కోట్లు ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్కు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Initiated by #MahilaBandhu CM Sri KCR, #KalyanaLakshmi #ShaadiMubarak have been immensely successful in preventing child marriages in the state
Over 10 lakh girls from poor background have received ₹9,072 Cr so far
#ThankYouKCR— KTR (@KTRTRS) March 7, 2022