Khammam | ఖమ్మం బ్రాహ్మణ బజార్లో దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి మహిళను ఓ దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు.
కస్బాబజార్లోని ఓ మాల్ పక్క సందులో శుక్రవారం రాత్రి ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉండటం స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతురాలిని భద్రాచలం పట్టణానికి చెందిన ప్రమీలగా గుర్తించారు. పిల్లలు పుట్టలేదనే కారణంతో గొడవలు జరగడంతో కొన్నేళ్లుగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ప్రమీలను భర్త స్నేహితుడు శ్రావణ్ వేధిస్తున్నాడు. నెల రోజుల క్రితం అతనిపై ప్రమీల కుటుంబసభ్యులు కేసు కూడా పెట్టారు. దీంతో తనకు లొంగలేదనే కోపంతో శ్రావణ్ కత్తితో పొడిచి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.