KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే ఆ చిన్నారికి ఎంతో అభిమానం. ఐదేండ్ల వయసున్న ఆ పాప రెగ్యులర్‌గా ఐటీ మినిస్టర్‌ను ఫాలో అవుతుంటోంది. అయితే పొర్టెయిట్ వేయడంలో దిట్ట అయిన ఆ చిన్నారి.. చిన్నపాటి రాళ్లతో కేటీఆర్ పొర్టెయిట్( KTR Portrait ) ను ప్రజెంట్ చేసింది. ఓ భవనం రూఫ్‌పై ఈ ప్రజెంటేషన్ చేసిన చిన్నారిపై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె ప్రజెంటేషన్‌కు కేటీఆర్ ఫిదా అయిపోయారు. చిన్నారిని త్వరలోనే కలుస్తానని ట్వీట్ చేశారు. ఆమెకు తన కృతజ్ఞతలు తెలియజేయండి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కేటీఆర్ పొర్టెయిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.