హైదరాబాద్ : దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులర్పించారు. తెలంగాణ భవన్లో నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి కేటీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి శ్రీ నాయిని నర్సింహారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS. pic.twitter.com/0gcAvqvV2z
— TRS Party (@trspartyonline) October 22, 2021