హైదరాబాద్ : స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. బాలానగర్ చౌరస్తాలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు కేటీఆర్. ఇవాళ ప్రారంభించుకున్న బాలానగర్ ఫ్లై ఓవర్‌కు బాబు జగ్జీవన్ రామ్ పేరును నామకరణం చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.
స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మంత్రి శ్రీ @KTRTRS #BabuJagjivanRam pic.twitter.com/8GvQSlD3rD
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 6, 2021