సంగారెడ్డి : జహీరాబాద్ స్టేడియంలో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పార్థివ దేహానికి మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ నివాళులర్పించారు. అనంతరం ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా నివాళులర్పించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫరీదుద్దీన్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. ఫరీదుద్దీన్ ఉమ్మడి మెదక్ జిల్లాకు, రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారు. ఫరీదుద్దీన్ అంత్యక్రియలను ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ గుర్తు చేశారు.